Header Banner

ట్రైనీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్..! నాలుగోసారి 800 మందికి టర్మినేషన్ టికెట్!

  Tue Apr 29, 2025 16:40        Employment

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ట్రైనీ ఉద్యోగులను తొలగించింది. అంతర్గత అసెస్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన కారణంగా తాజాగా 195 మంది ట్రైనీలను ఆ సంస్థ తొలగించింది. ఈ ఏడాదిలో కంపెనీ ట్రైనీలను తొలగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ మేరకు సంబంధిత ట్రైనీలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ తొలగింపులతో కలిపి, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది. 2022లో నియమితులైన ఈ ట్రైనీలను 2024 అక్టోబర్‌లో విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం.

అంతర్గత శిక్షణ అనంతరం నిర్వహించిన తుది పరీక్షలో నెగ్గలేకపోవడమే ప్రస్తుత తొలగింపులకు కారణంగా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్‌గ్రేషియాతో పాటు రిలీవింగ్ లెటర్‌ను అందజేస్తోంది. అంతేకాకుండా, ఎన్ఐఐటీ, అప్‌గ్రాడ్ వంటి సంస్థల ద్వారా ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటివరకు సుమారు 250 మంది ఈ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోగా, మరో 150 మంది ఇన్ఫోసిస్ అందిస్తున్న ఔట్‌ప్లేస్‌మెంట్ సేవల కోసం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తొలుత ఫిబ్రవరిలో 300 మంది ట్రైనీలను తొలగించింది. మార్చిలో 30-35 మందిని, ఏప్రిల్‌లో 240 మందిని తొలగించింది. తాజా తొలగింపు నాలుగోది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ మొత్తం 15,000 మంది ట్రైనీలను నియమించుకున్నట్లు గతంలో వెల్లడించింది.


ఇది కూడా చదవండి: డీఎస్సీ అభ్యర్థులకు మరో తీపి కబురు.. కీలక ఉత్తర్వులు విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Infosys #TraineeTerminations #ITJobsCrisis #CorporateLayoffs #TechNews #EmploymentShock